రక్తదానం ప్రాణదానంతో సమానం..

– భువనగిరి ఏసీపి రవి కిరణ్ రెడ్డి…
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : ఆపదలో ఉన్న వారి కోసం  రక్తదానం చేయడం ప్రాణదానం చేయడం లాంటిదేనని  భువనగిరి ఏసిపి ఈ. రవి కిరణ్ రెడ్డి,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు . సోమవారం భువనగిరిలోని వివేరా హోటల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ, రోటరీ క్లబ్ భువనగిరి సెంట్రల్, వివేరా హోటల్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవి కిరణ్ రెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి మాట్లాడుతూ నేటి యువత రక్తదానం చేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చునని చెప్పారు. కొత్త రక్తం ఉత్పత్తి కావడం వల్ల మనిషి మరింత ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా భువనగిరి, నార్కట్ పల్లి, వివేరా హోటల్స్ వ్యవస్థాపకుడు, రెడ్ క్రాస్ డివిజన్ అధ్యక్షుడు సద్ది వెంకటరెడ్డి సారధ్యంలో  ఈ రెండు హోటల్ల సిబ్బంది 62 మంది  రక్తదానం చేశారు.ఈ సందర్భంగా వివేరా హోటల్స్ ఎండి సద్ది రాఘవేందర్ రెడ్డి తన సతీమణి కావ్యరెడ్డి తో కలిసి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షుడు దిడ్డి బాలాజీ,రాష్ట్ర కమిటీ సభ్యులు మహేందర్ రెడ్డి, రోటరీ క్లబ్ భువనగిరి సెంట్రల్ అధ్యక్ష, కార్యదర్శులు పక్కీరు కొండల్ రెడ్డి ,హనీఫ్,రెడ్ క్రాస్ జిల్లా కమిటీ డైరెక్టర్లు,శేక్ హమీద్ పాశ,రాంబాయి,ప్రభాకర్ రెడ్డి,జంపాల అంజయ్య,రాజిరెడ్డి,చంద్ర శేఖర్,రోటరీ క్లబ్ సభ్యులు జ్ఞాన ప్రకాష్ రెడ్డి, యంపల్లె బుచ్చిరెడ్డి,ఎల్లంకి పురుషోత్తం రెడ్డి, ఎస్పీ ఉపేందర్ రావు లు పాల్గొన్నారు.
Spread the love