నిత్య అన్నదానానికి  రూ. 50116/- విరాళం

– మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు సభ్యులకు చెక్కును అందిస్తున్న  శైలజ సాంబశివు దంపతులు..
నవతెలంగాణ – వేములవాడ
మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తున్న అన్నదానానికి గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, తల్లితండ్రులైన కీ.శే.గణాచారి మఠం విమలమ్మ శంకరయ్య జ్ఞాపకార్థం ఆదివారం ట్రస్ట్ ద్వారా నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమానికి శాశ్వత అన్నదాతగారూ. 50116/-  రూపాయల చెక్కును ట్రస్టు నిర్వాహకులకు మధు మహేష్  అందజేశారు. ఈ సందర్భంగా  శైలజ సాంబశివు దంపతులు మాట్లాడుతూ ట్రస్టు ద్వారా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయ మని, ట్రస్టుకు మావంతు సహకారం అందించాలన్న ఉద్దేశంతో 50116/-  రూపాయలు ట్రస్టు వారికి అందించడం జరిగిందని అన్నారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ మాట్లాడుతూ ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ట్రస్టు ద్వారా నిర్వహించే సేవ, అన్నదాన కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరారు. అన్నదాన కార్యక్రమాన్ని 1025 రోజులుగా దాతల సహకారంతో పేద ,బడుగు, బలహీన అన్నార్తులకు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఇదే కాక ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి వైద్యానికి, విద్యకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుందని తెలిపారు. శాశ్వత అన్నదాన కార్యక్రమానికి విరాళంగా అందించిన గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువాతో దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు గొంగళ్ళ రవికుమార్, బస్మంగి బసవరాజు తదితరులు  పాల్గొన్నారు.
Spread the love