అధైర్యపడొద్దు..అండగా ఉంటాం..

– పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ 
నవతెలంగాణ – మల్హర్ రావు
అదైర్య పడొద్దు అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి,పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మదుకర్ అన్నారు. మంథని నియోజకవర్గంలోని ముత్తారం నమస్తే తెలంగాణ రిపోర్టర్ దేవర్నెని శ్రీధర్ తల్లి ప్రమీల అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా, శనివారం పుట్ట పరమార్షించి, అదైర్య పడొద్దు అన్నివిధాలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతురాలి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.
Spread the love