నవతెలంగాణ- మల్హర్ రావు
అదైర్య పడవద్దు అండగా ఉంటామని అఖిల భారత యాదవ సంఘం నాయకులు మేకల సంపత్ యాదవ్, పొలావెని అశోక్ యాదవ్, నలిగేటి సతీష్ యాదవ్, మామిడి కుమార్ యాదవ్, బోయిని రాజయ్య యాదవ్, పంచిక మల్లేష్ యాదవ్ అన్నారు. మండల కేంద్రమైన తాడిచెర్లలో ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన చిన్నారులు అరుణ్, కార్తీక్ ల కుటుంబాన్ని బుధవారం పరామర్శించి, ఓదార్చారు. అదైర్య పడొద్దని చిన్నారుల తల్లిదండ్రులు బొంతల అనూష-రాజు దంపతులకు ధైర్యం చెప్పారు. అనంతరం చిన్నారుల ఆత్మకు శాoతి చేకూరలని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.