40రోజులుగా నిరసన తెలుపుతున్న పట్టించుకోరా..

– యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు
నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో పనిచేస్తున్న కాంట్రాక్టు  అధ్యాపకులు శనివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమం 40 రోజులకు చేరిందని, ఇప్పటి వరకు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  తమ సర్వీసులను రేగ్యులర్ చేయాలని వారు  విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు దత్తాహరి మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్ పట్ల సానుకూలంగా స్పందించరని, రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో మాట మీద కట్టుబడి ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయాలని విన్నవించారు.ఈ కార్యక్రమంలో  డాక్టర్ శ్రీనివాస్, డానియల్, నాగేంద్రబాబు, సునీత, జోష్ణ, సీత, డాక్టర్ రాజేశ్వరి, సిహెచ్ శ్రీనివాస్, రామేశ్వర్ రెడ్డి, సురేష్, గోపిరాజ్, అపర్ణ, సందీప్, ఆనంద్ ,నర్సింలు, శ్వేత, ఈ కామర్స్ శ్రీనివాస్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love