మార్కులు వద్దు… గ్రేడింగ్ ముద్దు

– డిఈఓకు మెమోరండం  అందజేత
– బి స్మార్ట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డా.జలందర్ రెడ్డి
నవతెలంగాణ – భువనగిరి 
పదవ తరగతి ఫలితాలను పాత పద్ధతి, గ్రేడింగ్ విధానం లో విడుదల చేయాలని  తెలంగాణ బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డా. పగిడాల జలందర్ రెడ్డి  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.గురువారం  రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు  డిఈఓ కు మెమోరెండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర  వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పగిడాల  జలంధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రేడింగ్ పద్ధతిని ఎత్తివేసి మార్కులు ఇవ్వడం వల్ల కార్పొరేట్ స్కూల్స్ కు  లబ్ధి చేకూరుతుందని అన్నారు. విద్యార్థులు ఇప్పటివరకు గత సంవత్సరం గ్రేడింగ్ పద్ధతిని అనుసరించి  చదవడం జరిగిందన్నారు. విద్య సంవత్సరం మొదటి నుండి గ్రేడింగ్ పద్దతిలో చదివిన విద్యార్థులు ఆకస్మాతుగా మార్కుల విధానంగా మార్చడం శోచనీయమన్నారు. గ్రేడింగ్ పద్ధతిలో 90 పైన మార్కులు వచ్చిన విదర్థులందరికి ఒకే గ్రేడింగ్ ఇవ్వడం వల్ల నిరూత్సహం చెందకుండా ఉంటారన్నారు. ఒకే జీపీఏ గా చూపించే వారిని ఇప్పుడు మార్కుల రూపంలో వేస్తే విద్యార్థులు మానసిక ఆందోళన చెందుతారన్నారు. రాష్ట్ర లో బడ్జెట్ స్కూల్స్ ఎక్కువగా ఉన్నందున మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను వెంటనే రద్దుచేసి పాత పద్ధతిలోని గ్రేడింగ్ రూపంలో ఫలితాలను వెల్లడించాలని  విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీస్మార్ట్ సభ్యులు మిర్యాల దుర్గాప్రసాద్, బట్టి రెడ్డి రవీందర్ రెడ్డి, తోటకూరి యాదయ్య,  నోముల బస్వా రెడ్డి, సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,  పాల్గొన్నారు.
Spread the love