
– జయంతి వేడుకల్లో మద్నూర్ ఎస్ టి ఓ శివరాజ్
నవతెలంగాణ మద్నూర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప మహానీయుడని ఆయన రచించిన రాజ్యాంగం చాలా గొప్పదని మద్నూర్ ఎస్ టి ఓ శివరాజ్ పేర్కొన్నారు. జయంతి వేడుకల సందర్భంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్లు అమలవుతున్నాయని ప్రతి ఒక్కరికి హక్కుల సాధన కోసం ఆయన రాజ్యాంగం గొప్పదిగా గొప్ప మహనీయుడుగా ఎస్ టి ఓ కొనియాడారు.