జాతీయ వైద్యరత్న అవార్డు కూ ఎంపికైన డాక్టర్ శంకర నాయక్

– నిరంతర వైద్యం.. నిరుపేదలకు సేవే లక్ష్యంగా..
– లక్ష్మి విజయా పౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు
– గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
నవతెలంగాణ – పెద్దవూర
పేదింటి గిరిజన బిడ్డలు కష్టపడి చదివి వైద్య విద్యను పూర్తిచేశారు. విద్యాభ్యాసం అనంతరం సంపాదనను వెతుక్కుంటూ కార్పొరేట్ వైద్య ప్రపంచం వైపు వెళ్లలేదు. తమ భావాలు మర్చి పోకుండా గ్రామీణ బాట పట్టారు.విజయ, శంకర్ నాయక్ దంపతులు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కుంకు డుచెట్టుతండాకు వ్యవసాయ కుటుంబం రమావత్ భిక్షనాయక్, కమిలీ కుమారుడు శంకర్ నాయక్. పేదకుటుంబం కావడం తో చిన్నప్పటి నుంచి చదువంతా ప్రభుత్వ విద్యా సంస్థలల్లోనే కొనసాగింది. తండ్రి కాయ కష్టం చేస్తూ తన కుమారున్ని కష్టపడి మెడిసిన్ పూర్తి చేయించారు.ప్రభుత్వ వైద్యాధికారులుగా నియమితులై సేవలందిస్తూనే నిరుపేదలకు అందు బాటులో ఉండేవిధంగా అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా దేవర కొండ, హాలియాలో లక్ష్మి విజయపౌండేశన్ స్థాపించి సేవా కార్యాక్రమాలు చేపడుతున్నారు.ప్రస్తుతం దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్లో సివిల్ ఆసిసిస్టెంట్ సర్జర్ గా పనిచేస్తున్నారు.అతని సతీమణి విజయ చందంపేట మెడికల్ ఆఫీసర్ గా సేవలందిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ విశ్రాంతి లేకుండా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మారు మూల ప్రాంతాల్లో నివసించే పేదలు, గిరిజనులకు 24 గంటల పాటు వైద్యసే వలు అందింస్తున్నారు.
జాతీయ వైద్యరత్న అవార్దుకు ఎంపిక
డాక్టర్ శంకర నాయక్ అందిస్తున్న వైద్య సేవలు, పేదలకు సేవ చేస్తూ తనకున్న దాంట్లో ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ సేవలను గుర్తించిన బహుజన సాహితి అకాడమీ వారు  జాతీయ వైద్య రత్న అవార్డు 2024 గాను ఎంపిక చేశారు. బహుజన సాహితి అకాడమీ అవార్డు సెలక్షన్ కమిటీ చైర్మన్ మరియు బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు అహ్వాన పత్రాన్ని హైదరాబాద్లో బహుజన సాహితీ అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సంవత్సరం జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పూణేల నిర్వహించే  నాలుగవ సమావేశం జాతీయ వైద్యరత్న   అవార్డును అందజేయ నున్నట్టు తెలిపారు. వెస్టర్న్ ఇండియాలోని ఈ కాన్ఫరెన్స్ లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది డెలిగేట్స్ హాజరవుతారని తెలిపారు. ఈ అవార్డు సెలెక్ట్ చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన పై నమ్మకం ఉంచి అవార్డును సెలెక్ట్ చేసినందుకుగాను మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తానని డాక్టర్ శంకర తెలిపారు.
Spread the love