పూర్వ పాఠశాలకు సహకారం అందించిన డాక్టర్

Dr. who contributed to the former school– ఎంత ఎదిగిన ఉన్న ఊరును కన్న తల్లిని మరువకూడదు.
– లోహిత్ సాయి డాక్టర్ ఏ. భాస్కర్.
నవతెలంగాణ – తొగుట
విద్యార్థులు మరింత ఉన్నత విద్యను అభ్యసించా లని లోహిత్ సాయి డాక్టర్ ఏ. భాస్కర్ అన్నారు.  గతంలో మల్లన్న సాగర్ ముంపు గ్రామం వేముల ఘట్ ఉన్నత పాఠశాలలో విద్యాను ఆభ్యసిం చారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల గ్రామం ముంపునకు గురైన విషయం తెలిసిందే. తాను విద్యను అభ్య సించిన పాఠశాలకు సహకరించాలనే ఉద్దే శ్యంతో జడ్పిహెచ్ఎస్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పాఠశాలను శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంత ఎత్తుకు ఎదిగిన ఉన్న ఊరు ను కన్నతల్లిని మరవకూడదని గుర్తు చేశారు. పూర్వ పాఠశాల ఏదైనా సహకారం అందించాలనే ఆశయంతో విద్యార్థులు మరింత ఉన్నత విద్యను అభ్యసించడానికి గ్రంథాలయ పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్, డెస్క్ టేబుల్స్ బహుకరించామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్య సించి ఉన్నత స్థాయికి చేరి చేరుకోవాలని ఆశా భావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు లో రేపటి సమా జానికి సేవ చేస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానధ్యాపకులు కరీముద్దీన్, ఉపాధ్యాయ బృందం డాక్టర్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు చిన్నపాటి సత్కారం చేసారు.
Spread the love