నవతెలంగాణ- సారంగాపూర్: నీటి సంరక్షణ అందరి బాధ్యత అని ఇంచార్జీ డిఆర్డిఓ శ్రీనివాస్ అనారు.గురువారం సారంగాపూర్ మండలంలోని జౌలి గ్రామాల్లో వాటర్ షెడ్ యాత్ర కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం గ్రామాల్లో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు… భూగర్భ జలాలను పెంచడం వాటర్‌షెడ్ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం అమలయ్యే ప్రాంతంలో పడే ప్రతి చినుకునూ ఆ ప్రాంతంలోనే భూమిలోకి ఇంకేలా చేస్తారు. ఇందుకోసం కురిసిన కాస్తంత వర్షం వృథాగా పోకుండా అక్కడికక్కడే అడ్డుకట్ట వేసి చిన్న నీటి గుంటలు,అవసరం ఉన్నచోట చెక్ డ్యాం వంటి పనులు చేయడం ద్వారా భావితరాలకు నీటి కొడత లేకుండా చేసిన వారం అవుతామని గ్రామంలో అవగాహన కల్పించారు. అనంతరం చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి బాలిక అహ్మద్, తాసిల్దార్ శ్రీదేవి ఎంపీడీవో లక్ష్మీకాంతరావు, డి.అర్.పి గంగాప్రసాద్, ఎంపీఓ అజీజ్ ఖాన్, ఏపీఓ లక్ష్మారెడ్డి, ఏపీఎం మాధురి, డివైఆర్ఓ నజీర్ ఖాన్ ,కార్యదర్శి సాయి ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ సురేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
.