నవతెలంగాణ-కుభీర్
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం డిఆర్డిఓ పీడి విజయలక్ష్మి కుబేర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనుకోని ఉన్న మురికి కాలువతో మేదరి కాలనీ, విటళేశ్వర్ ఆలయ ప్రాంగణం ముంపుకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ భవేశ మిశ్రా దృష్టికి వెళ్లడంతో ఆయన ఇటీవల మురికి కాలువను పరిశీలించారు.
త్వరలోనే మురికి కాల్వ వెడల్పు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ పనులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గురువారం డి ఆర్ డి ఓ పి డి మురికి కాలువను పరిశీలించి ఉపాధి హామీ నిధులు మురికి కాలువ నిర్మాణం చేపడతామన్నారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను సైతం సందర్శించారు. పాఠశాలలో మురికి నీరు వర్షపు నీరు వృధాగా పోకుండా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ప్రత్యేక అధికారి వాణి కి సూచించారు.ఈ సందర్భంగా ఆమె వెంట స్థానిక సర్పంచ్ సాయినాథ్ ఉపాధి హామీ ఏపిఓ హరిలాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు విజేష్,కేజీబివి ప్రాథనోపాధ్యాయురాలు వాణి ఉపాధిహామీ టెక్నీకల్ అసిస్టెంట్ సంతోష్ తదితరులు ఉన్నారు.



