Thursday, June 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్షా

ఇందిరమ్మ ఇండ్ల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్షా

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ఉద్దేశంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన్నట్లు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) తో పాటు ఇతర సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలను పరిశీలించి, పరిష్కార మార్గాలపై చర్చించడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు.

అందువల్ల, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఆయా లబ్ధిదారులు తమ సంబంధిత పత్రాలతో పలు మండలాల లబ్ధిదారులు  జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి హాజరుకావడం జరిగింది అని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్  తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రతి అర్హ లబ్ధిదారుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తాం అని కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు పేర్కొన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ .. గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు.

జుక్కల్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్మాణ పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ నిమ్మ వి. గిరి, సంబంధిత అధికారులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులు తమ ఇల్లు నిర్మాణ దశకు అనుగుణంగా డేటా సక్రమంగా అప్‌డేట్ అయ్యిందో లేదో అధికారుల ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

అలాగే గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ గృహ పథకంలో తొలి ప్రాధాన్యత కల్పించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -