డిఎస్ ఇక లేరు

నవతెలంగాణ హైదరాబాద్: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ హైదరాబాద్‌ లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన చనిపోయినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
డిఎస్ సెప్టెంబర్‌ 27, 1948లో జన్మించారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు ఆయన స్వగ్రామం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు డీఎస్. 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన డీఎస్‌. 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి 3 సార్లు గెలిచారు. ఏడు సార్లు నిజామాబాద్‌ అర్బన్‌, ఓసారి రూరల్ నుంచి పోటీ చేశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా పనిచేశారు డీఎస్‌. 2014 వరకు తెలంగాణ కాంగ్రెస్‌లో నెంబర్‌2గా ఉన్నారు డీఎస్‌. 1988లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Spread the love