గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలి: డీఎస్పీ నాగేంద్ర చారి

– యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి..
నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలి..యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి..అదే స్ఫూర్తి  నిజ జీవితంలో అలవర్చుకుంటు ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూకలమర్రి హై స్కూల్ లో ఈ నెల 23 వ తేదీ న ప్రారంభం అయిన దోస్తీ మీట్ – 2024 కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను ముఖ్య అతిధిగా హాజరై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించగా సోమవారం రాత్రి  ముగిసినట్లు వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కబడ్డీ లో ప్రథమ స్థానం చెక్కపల్లి, ద్వితీయ స్థానం నూకలమర్రి, వాలీ బల్ ప్రథమ స్థానం నూకల మర్రి, ద్వితీయ స్థానం మర్రిపల్లి గ్రామాలు గెలుపొందగా, గెలుపొందిన జట్ల కు వేములవాడ డి.ఎస్.పి నాగేంద్ర చారీ చేతుల మీదుగా ట్రోఫీ లు ప్రదానం చేశారు. గెలుపొందిన జట్లు త్వరలో జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటాయి అన్నారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉంటుందని, చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.  కమ్యూనిటీ  పోలీసింగ్ లో భాగంగా జిల్లాలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు, మాధకద్రవ్యాల వలన కలుగు అనార్దలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ మీట్ – 2024 లో భాగంగా  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  ఆధ్వర్యంలో ఈక్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. యువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని, క్రీడల్లో ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, అదే స్ఫూర్తి ని నిజ జీవితంలో అలవర్చుకుంటు ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా,ఆరోగ్యం గా దృడంగా ఉండడంతో పాటు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని అన్నారు.నిజ జీవితంలో సమిష్టి కృషి తోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని అన్నారు. క్రీడ ఓటమి చెందిన వారు తమ లోపాలను సవరించుకొని  ముందుకు వెళ్లడం అలవర్చుకోవాలని అన్నారు.  సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ,కానిస్టేబుల్ రాజశేఖర్,శంకర్, విజయ్ సారధి, గ్రామ ప్రజలు,క్రీడాకారులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love