సీఈఐఆర్‌ అప్లికేషన్‌తో పోయిన ఫోన్ లు గుర్తింపు..

– సీఈఐఆర్‌ పోర్టల్ గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి..
వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ..
నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
పోగొట్టుకున్న, దొంగిలించబడిన ఫోన్‌లను సీఈ ఐఆర్‌ అప్లికేషన్‌ ద్వారా సులభంగా గుర్తించొచ్చ ని సోమవారం రూరల్ ఎస్సై మారుతి, సీఈఐఆర్‌ పోర్టల్ గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు. వేములవాడ రూరల్ మండలం పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్ ద్వారా కనుక్కొని, బాధితులకు తిరిగి అప్పగించిన వేములవాడ రూరల్ పోలీసులు. ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోయినట్టు అయితే సీఈఐఆర్‌ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా  కోల్పోయిన ఫోన్ తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో, ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం రాగానే ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న వ్యక్తి కి అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. సీఈఐఆర్‌ ద్వారా వేములవాడ రూరల్ మండలం  నూకలమర్రి గ్రామానికి చెందిన లక్ష్మణ్ నాయక్ కి స్థంభం పల్లి కి చెందిన మహేష్ కి వారి ఫోన్ అందించటం జరిగింది అని తెలిపారు. బాధితులు వేములవాడ రూరల్ పోలీస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love