ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సతీమణి

నవతెలంగాణ – రెంజల్
ఈనెల 17వ తారీఖున ఎంపీటీసీ అసాద్ బేగ్ అన్న సలీం బేగ్ కుమారుడు నవాజ్ తన స్నేహితులతో కలిసి సమీపంలో ఉన్న గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్లి ఈత కొడుతూ గోదావరిలో ప్రమాదవశత్తు మునిగి మృతి చెందారు. నవాజ్ ఈ సంవత్సరమే జిల్లా పరిషత్ పాఠశాల నీలా లో పదవ తరగతి చదువుతున్నారు. వారి కుటుంబ సభ్యులను సోమవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ సతీమణి ఐషా ఫాతిమా పరామర్శించారు. ఇంటి పెద్ద కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మనోధర్యంగా ఉండాలని ఆమె అన్నారు. ఆమె వెంట టిఆర్ఎస్ జిల్లా నాయకులు రఫీ ఉద్దీన్, తాజా మాజీ సర్పంచ్ కలీం బేగ్, ఎంపీటీసీ అసాద్ బేగ్, అధ్యక్షులు మోసిన్ బేగ్, నీలా పేపర్ మిల్ గ్రామ అధ్యక్షులు అవేజ్ ఖాన్, సోషల్ మీడియా కన్వీనర్ ముఖిద్, శ్రీకాంత్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love