– పీఆర్ టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి
నవతెలంగాణ – రెంజల్
ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగ విరమణ తప్పదని, ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి చేసిన కృషి మరువలేనిదని, పీఆర్ టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రెంజల్ మండలం తాడి బిలోలి జిల్లా పరిషత్ పాఠశాల హిందీ ఉపాధ్యాయులు రాజేందర్ సింగ్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 19 సంవత్సరాల కిందట రెంజల్ మండలంలో అడుగుపెట్టిన రాజేందర్ సింగ్ వివిధ పాఠశాలల్లో అనేకమంది విద్యార్థిని విద్యార్థులకు విద్యను బోధించి ప్రయోజకులను చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. విద్యార్థులకు విద్యతో పటు యోగాను నేర్పించడం ఆయన ప్రత్యేకత అన్నారు. తాను బోధించిన విద్యార్థులు నేడు అనేక ప్రభుత్వ ఉద్యోగాలలో చేరారని ఆయన పేర్కొన్నారు. రాజేందర్ సింగ్ కు రెంజల్ మండలం విడదీయరాని సంబంధం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. ఆయన అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులతో సన్నిహిత సంబంధం ఏర్పడడంతో పలువురు ఉపాధ్యాయులు కంటతడి పెట్టారు. ఆయన జీవితకాలంలో ఆయురారోగ్యాలతో తన జీవితాన్ని సాఫీగా సాగేలా భగవంతుడి కృప ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు ఎల్తేపు శంకర్, పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శులు టి. సోమలింగం గౌడ్, సాయి రెడ్డి, మండల కార్యదర్శి గోవర్ధన్, తాహర్, అబ్బయ్య, కిషోర్, అబ్దుల్ కరీం, విద్యా వనరుల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.