ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

– మండుటెండలో పనులు చేస్తున్న ఉపాధి కూలీలు..
నవతెలంగాణ – రెంజల్
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఆదేశాల మేరకు ఉపాధి హామీ కూలీలకు రోజువారి 300 రూపాయల కూలీ డబ్బులు వచ్చేలా ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఉపాధి హామీ కూలీలకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలతల ప్రకారం పనిచేయడానికి తమ సిద్ధంగా ఉన్నప్పటికీ మండుటెండలో పనిచేయడానికి టెంట్లు లేక, నాన్న ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆరోపించారు. అధికారులు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయకపోవడం, తాగునీటిని బాటిలలో తామే తీసుకోవాల్సి రావడం, జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. అధికారులు కూలీలకు సరియైన సౌకర్యాలను కల్పించి ఎండ దెబ్బ తగలకుండా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షేత్రస్థాయకులు ఓ ఆర్ ఎస్  పాకెట్లను మాత్రం అందజేస్తున్నారని, ప్రధమ చికిత్స కిట్లను సైతం ఉన్నప్పటికీ మిగతా సౌకర్యాలు కల్పించాలని కూలీలు కోరుతున్నారు.
Spread the love