రెంజల్ మండల కేంద్రంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో కేక్ కట్ చేసి, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రఫిక్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఏం డి మౌలానా, సాటాపూర్ తాజా మాజీ సర్పంచ్ వికార్ పాషా, రెంజల్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంజయ్య, సొసైటీ డైరెక్టర్ అగ్గు నారాయణ, ప్రభాకర్, తిరుపతి బుజ్జి, ఇబ్రహీం, అవేజ్, ముకిద్, హైమద్, బీఆర్ఎస్ యువ నాయకులు పాల్గొన్నారు.

Spread the love