ఢిల్లీ క్యాపిటల్ కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం

నవతెలంగాణ – ఢిల్లీ; ఢిల్లీ క్యాపిటల్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ స్టార్ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 మొత్తానికి దూరమయ్యారు. తొడ కండరాల గాయానికి చికిత్స కోసం అతడు కొన్ని రోజుల క్రితమే ఆస్ట్రేలియాకు వెళ్లారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. మార్ష్ ఈ ఐపీఎల్లో కోల్కతా నైటైడర్స్ తో ఈ నెల 3న చివరి మ్యాచ్ ఆడారు. ఇక ఈ సీజన్లో 4 మ్యాచ్ లు ఆడిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ 71 పరుగులు మాత్రమే చేశారు. అటు బౌలింగ్లో కూడా ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టారు. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో కేవలం మూడు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి పాయింట్ పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది

Spread the love