ప్రతి కార్మికుడికి రూ. 26 వేల వేతనం ఇవ్వాలి..

నవతెలంగాణ – మాక్లూర్ 
మండలంలోని మాణిక్ బండర్ చెక్క వద్ద భారత కార్మిక సంఘాల సమైక్య (ఐ ఎఫ్ టు యు) జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కార్మికులకి కనీస వేతనం రూ. 26 వేల వేతనం ఇవ్వాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఉపాధి ఉద్యోగ భద్రత సోషల్ సెక్యూరిటీ కల్పించాలని, లేబర్ కోడ్స్ ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దించాలని అన్నారు. కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను క్రమబుద్ధికరించాలని కోరారు. ఈ డిమాండ్స్ పై ఈ నెల 8న హైదరాబాదులో భారీ ర్యాలీ ఉంటుందని, ఈ ర్యాలీ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్, జిల్లా నాయకులు సురేష్, లక్ష్మణ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love