Thursday, May 14, 2026
E-PAPER
Homeజాతీయంఈసీ స‌ర్‌..తెలంగాణ‌లో ఎప్పుడంటే..?

ఈసీ స‌ర్‌..తెలంగాణ‌లో ఎప్పుడంటే..?

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా ఓట‌ర్ జాబితా స‌వ‌ర‌ణ‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ఈసీ) శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో భారీ యోత్తున్న ఓట్ల‌ల‌ను తొల‌గించింది.దీంతో ప్ర‌తిప‌క్షాలు అనేక సందేహాలు లెవ‌నెత్తాయి. తాజాగా రెండు ద‌ఫాల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన ఈసీ మూడో ద‌శ స‌ర్‌(SIR)కు స‌న్నాహాలు మొద‌లు పెట్టింది.

16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర జాబితా ప్రత్యేక సవరణ (SIR) నిర్వహించేందుకు రాష్ట్రావారీగా తేదీలను ప్రకటించింది. జనగణన, క్షేత్ర స్థాయిలో అధికారుల అందుబాటును దృష్టిలో ఉంచుకొని వివిధ రాష్ట్రాల్లో సర్ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో జూన్ 25, 2026 నుంచి జూలై 4,2026 వరకు నెలరోజుల పాటు అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై31,2026న ప్రకటించనుంది. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్1,2026న ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ దశలో రాజకీయ పార్టీలు నియమించిన 3.42 లక్షల బూత్ స్థాయి ఏజెంట్ల (BLAల) సాయంతో 3.94 లక్షల బూత్ స్థాయి అధికారులు (BLOలు) 36.73 కోట్ల మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేయనున్నారు.

మూడో దశ SIR : తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్.

కేంద్రపాలిత ప్రాంతాలు: దాద్రా నగర్ హవేలీ,డామన్ డయ్యూ, చండీగఢ్ ,జాతీయ రాజధాని ప్రాంతం (NCT ఆఫ్ ఢిల్లీ).

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -