ఇటుక బట్టీల కార్మికుల పిల్లలకు విద్యను అందించాలి

– కల్లెపల్లి అశోక్ సీపీఎం మండల కార్యదర్శి
నవతెలంగాణ – పెద్దపల్లి టౌన్ 
సిపిఎం పార్టీ పెద్దపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇటుకబట్టిలలో పనిచేస్తున్న కార్మికులకు వారి స్థితిగతులనుపై ఇటుకబట్టిలను సందర్శించి ఇటుక బట్టీలో పని చేస్తున్న కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ కార్మికులను 17 నుండి 19 గంటలు పని చేపిస్తున్నారని, కార్మికుల పిల్లలకు కనీసం విద్యను చెప్పించడం లేదని, కనీస వసతులు కూడా కార్మికులకు కల్పించడం లేదని అన్నారు. ఇటుక బట్టిల యజమానులు కార్మికులను చేస్తున్న పని ఒత్తిడి వలన అనేకమంది కార్మికులు చనిపోతున్నారని అన్నారు. ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు తప్పకుండా విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీగా ప్రభుత్వాన్ని కోరారు. బట్టిలను సందర్శించిన వారిలో సిపిఎం నాయకులు మోదంపల్లి శ్రావణ్, కుమ్మరి నవీన్, శ్రీశైలం, ఉన్నారు
Spread the love