గ్రామాల్లో అనారోగ్యస్తులకు ఆపద్బాంధవుడిలా నిలిచే ఆర్ఎంపి వైద్యుల మండల కమిటీని శుక్రవారం మండల కేంద్రంలో సంఘం గౌరవ అధ్యక్షుడు ఎండి నాయిమ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బండ యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా దాసరి మహేందర్, ఉపాధ్యక్షులుగా దాసరి రమేష్, మన్నూరు హరీష్, కోశాధికారిగా ముద్రబోయిన శ్రీను, సహాయ కార్యదర్శిగా ఉల్లెంగుల యాకయ్య, ఎనగందుల సోమేశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ దొమ్మటి శ్రీనును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన యాదగిరి మాట్లాడుతూ.. ఉన్నత చదువులు అభ్యసించి నిరుద్యోగం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రథమ చికిత్స అందిస్తూ ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఒక ఆర్ఎంపి వైద్యుడు ఆరోగ్య సలహాదారుడిగా ఉంటూ వారి ఆరోగ్యాలను కాపాడుతున్నాడని కొనియాడారు. నాపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్క ఆర్ఎంపీ వైద్యుడికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరి కష్టంలో తోడుగా ఉంటా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎనగందుల శ్యాంసుందర్, శ్రీనివాస్, కుమారస్వామి, సుధాకర్, చిరంజీవి, మహేందర్, రమేష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.