ఓబీసీ ఎస్సీ మోర్చాల ఎన్నిక

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం లో ఓబిసి మోర్చా జిల్లా కోశాధికారిగా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన రాధారపు సత్తయ్యను ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆరెగూడెం కు చెందిన కట్ట కృష్ణ లను బుధవారం భారతీయ జనతా పార్టీ యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ,ఎస్సీ మోర్చా అధ్యక్షులు డిఎల్ఎన్ గౌడ్ బుగ్గ దేవేందర్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నం శివకుమార్ జిల్లా కార్యదర్శి బత్తుల జంగయ్య గౌడ్ ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దాసోజు బిక్షమాచారి చౌటుప్పల్ మండల బీజేపీ అధ్యక్షులు చినుకని మల్లేష్ యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి లగ్గోని పాండు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love