వివిధ యూనియన్ల నుండి సీఐటీయూలో భారీ చేరిక

నవతెలంగాణ – హాలియా
నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో వివోఏలు భవన నిర్మాణ కార్మికులు హమాలీ కార్మికులు ఎలక్ట్రిషన్ కార్మికులు 250 మంది టిఆర్ఎస్కెవికి రాజీనామా చేసి సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి  సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి  ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సి ఐ టి యు లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వారిలో ఎస్కే బషీర్ తిరుమల దుర్గయ్య రేపెల్లి వెంకటేశ్వర్లు ఆనందపాల్ రోశయ్య గోవిందరాజు ఎస్ కే సైదు షైన్ కాట్నం వెంకటయ్య సురేష్ పాపయ్య లతోపాటు 250 మంది సిఐటియు కండువా కప్పుకొని యూనియన్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పక్షాన కార్మిక వర్గం పక్షాన నిలబడేది ఎర్రజెండా మాత్రమేనని ఎరుపులోన మెరుపులు పోరాడే శక్తి గలది ఎర్రజెండా అని వారన్నారు.ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న కార్మికుల పక్షాన రాజీలేని పోరాటాలు చేసేది ఒక ఎర్రజెండా మాత్రమేనన్నారు. ఎందరో ప్రాణ త్యాగాలు చేసి కార్మిక సంక్షేమ చట్టాలు తీసుకొచ్చింది ఎర్రజెండా మాత్రానికే కలదని వారన్నారు సిఐటిలో చేరిన వారు మాట్లాడుతూ మాతృ సంస్థలకు రావటం ఎర్ర జెండా కింద పనిచేయటం ఎంతో గౌరవంగా ఉంటుందని మాకు ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది ఎర్రజెండా అని గుర్తు చేసుకున్నారు. జెండా మీద పడగానే ఉద్యమం స్ఫూర్తి ఉద్భవిస్తుందని భవిష్యత్తు ఉద్యమాలకు మా వంతు కర్తవ్యాన్ని అందిస్తామని వారన్నారు ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెకు వేలాది మంది కార్మికులతో సమ్మెను జయప్రదం కోసం మా వంతు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్న పాక లక్ష్మీనారాయణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్  రెడ్డి నాగిరెడ్డి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు కొండేటి శీను, నాయకులు కత్తి శ్రీనివాస్ రెడ్డి దుబ్బా రామచంద్రయ్య,కందుకూరు కోటేష్, వనమాల కామేశ్వర్ కోమండ్ల గురువయ్య, ఏసోబు శంకర్ల,లక్ష్మమ్మ, అనూష, అచ్చమ్మ తదితరులున్నారు
Spread the love