అండర్ 14 స్కూల్ గేమ్స్  సాఫ్ట్ బాల్ పోటీలకు నేహా ఎంపిక..

నవతెలంగాణ –  డిచ్ పల్లి

డిచ్ పల్లి మండలం లోని దర్మారం బీ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల కు చెందిన విద్యార్థిని నేహ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని ప్రిన్సిపల్ సంగీత తెలిపారు. గత నెల ఆర్మూర్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి ఈనెల చత్తిస్ ఘడ్ లో నిర్వహించే 3 నుండి 7 వరకు జరగబోయే జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలలో పాల్గొంటుందని తెలిపారు. విద్యార్థిని స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ నీరజా రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కిషన్, పిఈటీ జోష్ణ, హౌస్ టీచర్స్   అభినందించారు.
Spread the love