రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మృతి..

నవతెలంగాణ- డిచ్ పల్లి

సదాశివ్ నగర్ మండలంలోని దగ్గిర అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి రోడ్డు దాటుతున్న ఎడారి వయస్సు ఉన్న ఆడ చిరుత పులి ని ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు . స్థానికులు , అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి వైపు నుండి నిజామాబాద్ వైపు వచ్చే రహదారి నుండి దాటుతుండగా చిరుత పులి నీ ఒక గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందినన్నారు. సమాచారం అందుకున్న కామారెడ్డి రేంజ్ అధిaకారులు ఘటన స్థలానికి చేరుకుని చిరుత ను పరిశీలించారు. అనంతరం చిరుత పులిని తమ ఆధీనంలోకి తీసుకొని శుక్రవారం డాక్టర్లతో శవ పంచనామా నిర్వహించి, దాని అవయవాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్ కు పంపించనున్నారు. అనంతరం డిఎఫ్ఓ,ఎఫ్ డి ఓ ల ఆధ్వర్యంలో మృతి చెందిన చిరుత పులికీ దహాన సంస్కరాలను చేపట్టి, ఇందల్వాయి వద్ద ఉన్న టోల్ ప్లాజా లో సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేపడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Spread the love