కళ్ళ కలక పై ప్రజలకు అవగాహన కల్పించాలి..

– కళ్ళల్లో ప్రభావితం చేసే ఒక రకమైన అంటువ్యాధే…
– ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్..
నవతెలంగాణ- డిచ్ పల్లి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయిలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య కార్యకర్తలతో కళ్ళ కలకకు సంబంధించి సమిక్ష సమావేశం, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కండ్ల కలక వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా కళ్ళల్లో ప్రభావితం చేసే ఒక రకమైన అంటువ్యాధి అని, ఇది వరదలు, వాతావరణ మార్పుల కారణంగా కంటి కలక రోగులు పెరుగుతూ ఉన్నారని కళ్ళు ఎరుపు, ఎరుపు మూతలు, వాపు, దురద కంటిలో ఉంటుందని కనురెప్పలు అంటుకొని ఉండవచ్చని పిల్లలను జ్వరం కూడా ఉంటుందని వీటికి చర్యలు చికిత్స అందించుకోవాలని అది కళ్ళను శుభ్రం చేయడానికి శుభ్రమైన నీటిని శుభ్రమైన రుమాలును వాడాలని ,కళ్ళను రుద్దకూడదని, సరైన కంటి గ్లాసులను వాడే విధంగా చూడాలని సూచించారు. కళ్ళలో ఏవైనా చుక్కలు, కంటి చుక్కలు వాడేటప్పుడు వైద్యునికి సంప్రదించి వైద్యుని సలహా మేరకు మాత్రమే కంటి చుక్కలను వాడాలని ఈ కళ్ళ కలక కు నివారణ మార్గము చేతులను తరచు సబ్బుతో శుభ్రంగా కడుక్కొని శానిటైజర్లను వాడాలని, రక్షిత కళ్ళద్దాలు ధరించాలని, కళ్లను శుభ్రమైన నీడితో  కడుక్కోవాలని, శుభ్రమైన తువాలు, బెడిషీట, కళ్ళుకలక సోకిన వ్యక్తి ఇతరులకు దూరంగా ఉండాలని ఎందుకంటే ఇది అంటువ్యాధి  ఇతరులకు సోకకుండా ఇంట్లో సరియైనటువంటి ఐసోలేషన్ ప్రదేశంలో వారిని ఉంచాలని సిమ్మింగ్ పూల్ లాంటి వాటిలో ఈత కొట్టడం గానీ, రద్దీ ఉండే ప్రదేశాలను తిరగడం గాని చేయకూడదని ఇదే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చూడాలని పేర్కొన్నారు.ఇదే కాకుండా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు పెంచాలని ప్రజలలో అవగాహన కార్యక్రమం లు అధికంగా చేయడం ద్వారా ఈ కంటి కలక అంటువ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు అక్బర్ అలీ, ఉమా రాణి, ఆనంద్, సునీత, స్వరూప, విజయలక్ష్మి ఫార్మసిస్ట్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love