చేట్టును ఢీకొన్న కారు.. నలుగురికి తీవ్ర గాయాలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ పోలీస్టేషన్ పరిధిలోని 44 వ నెంబర్ జాతీయ రహదారి వెస్లీనగర్ తండా వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ కు చెందిన ఓకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్సై యు మహేష్ తెలిపారు. నిర్మల్ కు చెందిన నారగోని సంజీవ్ తన కుటంబ సభ్యులతో కలిసి కారులో డిచ్ పల్లి వైపు నుండి ఆర్మూర్ వైపు వెళుతుండగా ప్రమాద వశాత్తూ కారు అదుపు తప్పి రాహదరి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల పాపతో పాటు ముగ్గురికి తీవ్ర యాలయ్యాయి. నిర్మల్ కు చెందిన వీరు హైదరాబాద్లో పని ముగించుకుని తిరిగి నిర్మల్ వెళుతుండగా వెస్లీనగర్ తండా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.గాయల పాలైన బాధితులను వెంటనే అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. గాయపడిన వారిలో నారగో రాజాత బార్య, అతని కూతురు సంధ్యారాణి పంచాయితీ కార్యదర్శి, మనుమారాలు వేదకృతిక ఉన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. వేదకృతిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Spread the love