ఊరుకొండ మండలానికి అండగా ఉంటా..

– డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు నాలుగుసార్లు శంకుస్థాపన చేసిన ఫలితం శూన్యం.

– ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాహిత పాదయాత్ర. 
– టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి.
నవతెలంగాణ –  ఊరుకొండ 
ఊరుకొండ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని.. ఇప్పటివరకు అధికారంలో ఉండి కూడా ఏమాత్రం పట్టించుకోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఊరుకుండ మండలంపై చిన్నచూపు ఎందుకని టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఊరుకొండ మండలంలోని తిమ్మన్నపల్లి, రేవల్లి, రాచాలపల్లి, మాదారం, గుడి గాని పల్లి గ్రామాలలో ప్రజాహిత పాదయాత్ర ప్రజల సమక్షంలో నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఆయా గ్రామాల్లోని అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి నాలుగుసార్లు శంకుస్థాపన చేసిన ఇప్పటివరకు ఎలాంటి పనులు ముందుకు సాగలేదని దుయ్యబట్టారు. ధరణి పేరుతో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల భూములను లాక్కోవడం.. భూకబ్జాలు చేయడం.. దేవాలయ భూములను సైతం కబ్జా చేసిన ఘనత బీఆర్ఎస్ నాయకులకు చెందుతుందని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రబ్బాని, తిరుపతిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అయూబ్ పాషా, రమేష్ నాయక్, వెంకటయ్య గౌడ్, గోtheపి నాయక్, సమ్మి, గోపాల్, జగదీష్, శివలీల రాజు, శ్యాంసుందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వెంకటమ్మ శ్రీనివాస్, యాదయ్య, గణేష్, దయాకర్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love