మంత్రికి వినతి పత్రం అందజేసిన తల్పునూర్ గ్రామస్తులు

నవతెలంగాణ – రేవల్లి
తల్పునూర్ గ్రామని నాగర్ కుర్నాల్ జిల్లాలో కలపాలి అని గురువారం రోజున మంత్రి నిరంజన్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో ఉన్న తల్పునూర్ గ్రామం వనపర్తి జిల్లాకి 30 కిలోమీటర్ల దూరం ఉండడంతో, గ్రామస్తులు బస్ సౌకర్యం లేదు, విద్యకు మరియు వైద్యకు వెళ్లాలంటే 30 కిలోమీటర్ల వరకు వేలాల్సివస్తుంది అని. అత్యవసర సరుకులకు వెళ్లాలంటే ఇబందిగా మారింది అని, గ్రామస్తులు సమస్యలకు గురి అవుతున్నారని, నాగర్ కర్నూల్ జిల్లా 12 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నందున, అత్యవసర సరుకులు వైద్యానికి అనుకూలంగా ఉండడంతో తరచుగా నాగర్ కర్నూలు జిల్లాకె వెళ్తూ వస్తుంటారని మంత్రి నిరంజన్ రెడ్డికి వారి బాధలు చెప్పుకున్నారు. మంత్రి చెప్పిన విధంగా ఎలక్షన్స్ తరువాత మాట్లాదామని ఇప్పుడు వీలు కాదని తెలిపినట్లు గ్రామ ప్రజలు తెలిపారు.దీంతో నిరాశ చెంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

Spread the love