అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే..

నవతెలంగాణ -ఆర్మూర్
పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన 108, 102 అంబులెన్స్ వాహనాలను ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి గురువారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్ ప్రభుత్వ ఆస్పత్రి సూపర్ ఇండెంట్ డాక్టర్ నాగరాజు డాక్టర్ అమృత్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆశ వర్కర్లకు గొడుగుల పంపిణీ డివిజన్ సెకండ్ ఏఎన్ఎంలకు వర్షాకాలం సందర్భంగా.. గొడుగులను పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద అభిమానంతో కేసీఆర్ ఆకారంలో నిలబడి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Spread the love