గాలికుంటు నిరోధక టీకాలు తప్పనిసరి..

– పశువైద్యాధికారి నాగరాజు
నవతెలంగాణ – ఊరుకొండ 
మండలంలోని రైతులందరూ తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని మండల పరిసవైద్యాధికారి నాగరాజు అన్నారు. మంగళవారం ఊరుకొండ మండల పరిధిలోని గుడిగానిపల్లి గ్రామంలో పాడి పశువులకు, గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. జులై 3 నుండి ఆగస్టు 25 వరకు గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విఎల్ఓ రవీందర్ రెడ్డి, సిబ్బంది కురుమయ్య, ఇస్తియాక్, శేఖర్,  శ్రీశైలం, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love