ఉద్యోగ భద్రత కల్పించాలి..

– 27వ రోజు సమ్మెలో బీఎస్పీ నేతల మద్దతు.
నవతెలంగాణ – ఊరుకొండ
గ్రామాల్లో ప్రతినిత్యం వెట్టి చాకిరి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతభత్యాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని పారిశుద్ధ్య కార్మికుల మండల అధ్యక్షుడు పరశురాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఊర్కొండ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గత నెల 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెలో భాగంగా 27వ రోజు గ్రామపంచాయతీ కార్మికులు పచ్చి మిరపకాయ లు  తినుకుంటూ  వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నేతలు పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ జడ్చర్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జి శివకుమార్, జడ్చర్ల అధ్యక్షుడు లీడర్ శీను, ఊర్కొండ మండల అద్యక్షుడు చరణ్, ఉపాధ్యక్షుడు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి శంకర్, ప్రతాప్, మండల కార్యదర్శి హరీష్, పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షులు పరుశురామ్, ఉప అధ్యక్షులు ఆంజనేయులు, పంచాయతీ కార్మికులు నర్సింహా, ఆంజినేయులు, హుస్సేన్, జంగయ్య, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love