నవతెలంగాణ-రేవల్లి
రేవల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో పారసీకంగా దెబ్బతిన్న వారు ” మేడిపూరి కృష్ణయ్య, సత్తార్, అల్లాహుద్దీన్ సత్తార్ ” వీరి ఇండ్లు కూలడంతో పేద కుటుంబం రోడ్డున పడింది. దీంతో ఇంట్లోని నిత్యవసర సరుకులు, దుస్తులు తడిచాయి. ఈ సమయంలో ఇంట్లో ఎవరు లేనందున పేను ప్రమాదం తప్పింది. అని ఎస్సై శివకుమార్ చెప్పగా.. ఇది గమనించిన ” తహసిల్దార్ ” శ్రీరాములు ఇండ్లు కూలిపోయిన వాళ్లు, కొత్త ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకోండిపై అధికారుల దృష్టికి తీసుకుపోతానని, ఇప్పటివరకు నష్టం జరిగిన వారు ఎనిమిది మంది దరఖాస్తులు చేశారని తెలిపారు. ముందు ముందు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు నిర్లక్ష్యంతో ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శివకుమార్ తెలిపారు.