అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి..

– మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
– పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా
నవతెలంగాణ – మీర్ పేట్
మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4,7వ డివిజన్లలో రూ 2 కోట్ల 25 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మహేశ్వరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మీర్ పేట్ కార్పొరేషన్ ను ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతాం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహేశ్వరం పర్యటనలో విడుదల చేసిన 50 కోట్లతో మీర్ పేట్ కార్పొరేషన్ లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య లేకుండా చేయటానికి 210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు నూతన పైప్ లైన్లు, ట్యాంకులు, రిజర్వాయర్లు కడుతున్నామని త్వరలో మంచి నీటి సమస్య పరిష్కారం అందుతుందని పేర్కొన్నారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ ఇతర అభివృద్ధి పనులు తొందరగా ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న బిఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య, స్థానిక కార్పొరేటర్లు సిద్దాల బీరప్ప, సిద్దాల పద్మ అంజయ్య, పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Spread the love