నవతెలంగాణ -ఆర్మూర్
పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాల ఆవరణలోని నవనాథపురం ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోరీ జరిగింది. వంటశాల యొక్క గది తాళాలను పగలగొట్టి వంట సామాగ్రిని ఎత్తుకెళ్లినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ తెలిపారు. అయితే వీటి యొక్క విలువ సుమారుగా 15000 వరకు ఉంటుందని తెలిపారు. సంఘటన స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించినారు.