రహదారిపై ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం

నవతెలంగాణ- రేవల్లి
మండలం నుంచి తల్పునూర్ గ్రామానికి వెళ్లే ప్రధానమైన రోడ్డు మార్గం నుంచి వెళుతున్న, మెయిన్ లైన్ విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు ” కొత్త స్తంభాలు ” పాతారు. కురిసిన భారీ వర్షాలకు ఒక విద్యుత్ స్తంభం రహదారిపై ప్రమాదకర స్థితిలో నిలబడి ఉంది, ఆ రహదారి పై స్కూల్ పిల్లలు బస్సులో వెళుతు వస్తుంటారు, ఇది పాదాచారులపై పడితే ప్రాణ నష్టం కూడా జరుగుతుందని, విద్యుత్ స్తంభానికి ఎటువంటి విద్యుత్ వైర్లు కలెక్షన్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి, పాలకులు ఈ సమయంలోనే ఆ స్తంభాన్ని సరి చేయగలరు అని వాహనదారులు గ్రామస్తులు తెలిపారు. లేకుంటే ముందు ముందు భారీ వర్షాలకు విద్యుత్ స్తంభం నేలపైకి వరిగి  ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందన్నారు.
Spread the love