ఉరి వేసుకుని వివాహిత చికిత్స పొందుతూ మృతి..

నవతెలంగాణ- డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన చేన్న శ్రావణికి 26 ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడగా స్థానికులు గమనించి కోన ఊపిరితో ఉన్న శ్రావణికి చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై యు మహేష్ బుదవారం తెలిపారు. అయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.ఇందల్ వాయి పోలిస్ స్టేషన్ పరిధిలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన చెన్న శ్రావణికి నిజామాబాద్ నగరంలోని నాగారం  గ్రామానికి చెందిన లక్ష్మణ్ తో ప్రేమ వివాహం గత అరేళ్ళ క్రితం జరిగిందనిరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నాడు. జీవనోపాధి నిమిత్తం లక్ష్మణ్ శ్రావణిలు పిల్లలతో కలిసి నాగారం వదిలి శ్రావణి తల్లి గ్రామమైన తిర్మన్ పల్లి కి వచ్చి గ్రామంలో అద్దెకు ఇళ్లు తిసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తాగుడికి బానిసైన భర్త  లక్ష్మణ్ నిత్యవసర వస్తువులు తేకుండా, ఇంటి అద్దె చెల్లించకుండా భార్యతో తరచూ గొడవపడేవాడని, ఈ క్రమంలో మంగళవారం రోజున భార్యతో గొడవపడి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని చెప్పడంతో భార్య శ్రావణి అలా
అయితే నేను చచ్చిపోతాను అని  చెప్పిందన్నారు.చచ్చిపోతే చచ్చిపో  అని లక్ష్మణ్ తేల్చి చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.అ ఆవేశంలో శ్రావణి అద్దేకి ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు  పాల్పడింది.వేంటనే గ్రహించిన  శ్రావణి పెద్ద కూతురు సంయుక్త తల్లి ఊరి వేసుకున్న విషయం గ్రహించి ఇతరులకు తెలుపగా వారు వారు వచ్చి చూసి కోన ఊపిరితో ఉన్న  శ్రావణిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు ఎస్సై యు మహేష్ తెలిపారు.ఘటనపై మృతురాలి తల్లి చిన్న రాజమణి అల్లుడు లక్ష్మణ్ పై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర మార్చురీకి తరలించినట్లు ఎస్సై మహేష్ వివరించారు.
Spread the love