అడిషనల్ కంట్రోలర్ గా(ఈడిపి) సెక్షన్ కు డాక్టర్. బి. నందిని నియామకం..

నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వాకాటి కరుణ  ఐఏఎస్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.యాదగిరి డాక్టర్. బి నందినికి అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ( ఈడీపీ)సెక్షన్  కు నియామక ఉత్తర్వులను మంగళవారం అందజేశారు. గతంలోడా.బి. నందిని అసిస్టెంట్ కంట్రోలర్. ఉమెన్ సెల్  డైరెక్టర్,  ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామర్ గా, బాలికల వసతి గృహానికి  వార్డెన్ గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెల్ కు డైరెక్టర్ గా సిబిటి కోఆర్డినేటర్ గా కంప్యూటర్ సైన్స్ హెడ్ మరియు బిఓఎస్ గా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా విజయవంతంగా విధులు నిర్వహించారు. ఈ నియామకపు ఉత్తర్వులు అందుకున్న డాక్టర్.బి. నందిని మాట్లాడుతూ యూనివర్సిటీ  అభివృద్ధిలో భాగం పంచుకుంటామని వైస్ ఛాన్సలర్, రిజిస్టార్లకు  కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love