ఎన్నికలంటే ఓట్ల పండుగ కాదు..ఐదేళ్ల భవిష్యత్తు

– కాంగ్రెస్ కి ఓటేస్తే రిస్కు తప్పదు

– గ్యారెంటు లేని కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి
– కాంగ్రెస్ బిజెపి డకౌట్ ఖాయం
– కాలి కుర్చీలతో కాంగ్రెస్ బిజెపి మీటింగ్ లు
నవ తెలంగాణ – బొమ్మలరామారం
ఎన్నికలంటే ఓట్ల పండుగ కాదని.. మన ఐదేళ్ల భవిష్యత్తు అని బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేత.. మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను చూసి మోసపోవద్దన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు నియోజకవర్గం అభ్యర్థి గొంగడి సునీత మద్దతుగా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కాంగ్రెస్ బిజెపి అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు మోటార్లకు మీటర్లు తప్పవని, గ్యారంటీ లేని స్కీంలతో కర్ణాటక మంత్రిని నమ్ముకున్న కాంగ్రెస్ కు తెలంగాణలలో ఓటర్ దెబ్బకు దిమ్మతిరగాల్సిందేన్నారు.అవగాహన లేని ఉత్తి తుపాకి రాముడు రేవంత్ రెడ్డి.జాడ లేని రాహుల్ గాంధీ జాడ లేకుండా ప్రియాంక గాంధీ ఢిల్లీలో ఉందని. గతిలేని సంసారం నడపొచ్చు గాని శృతి లేని సంసారం నడపడం కష్టమన్నారు.రైతులు జోలికొస్తే ఊరుకునే పరిస్థితి లేదని కేసీఆర్ కు రైతులంటే ఎంతో ప్రేమని అన్నారు. కాంగ్రెస్ అంటే కరుగుతే ఆగo ఆగమయితారు. కాంగ్రెస్ పుట్టుక పురాణం తెలియనిది కాదు, ఆలేరు నియోజవర్గంలో ఐటీ పరిశ్రమ కంపెనీలు తెచ్చే బాధ్యత నాదని అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కెసిఆర్ అద్భుతంగా కట్టాడన్నారు. రిస్కు వద్దని కారు ఓటు గుద్దాలన్నారు బోరు మోటర్లు పెడుతున్న బిజెపి కావాలా..? రైతులకు 5 గంటల కరెంటు ఇస్తా అంటున్న కాంగ్రెస్ కావాలా..?24 గంటలు కరెంటు ఇచ్చే తెలంగాణ కావాలో ప్రజలే ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ సమయంలో రాష్ట్ర ప్రజలు కరెంటు కష్టాలతో ఇబ్బందులు పడేవాళ్లన్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డికి సిగ్గు, శరం లేకుండా కరెంట్ గురించి మాట్లాడుతున్నారని మండి పడ్డారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు ఒక బస్సు ఏర్పాటు చేస్తామని, ఆలేరు నియోజకవర్గంలో ఎక్కడైనా కరెంటు తీగలు పట్టుకోని, అప్పుడు 24 గంటల కరెంటు వస్తుందో లేదో తెలుస్తుందని చెప్పారు.‌ మూడు గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ కావాలా…24 గంటల కరెంటిస్తున్న బీఆర్ఎస్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుందన్నారు. కాంగ్రెస్ కావాలో…కరెంటు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంటు కాదని, ఉత్తుత్తి కరెంట్ అని విమర్శించారు. వరిధాన్యం పండించడంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నంబర్ వన్ అన్నారు. 55 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు ఏంపీకారని గట్టిగా మండిపడ్డారు.కాంగ్రెస్ కు ఒక్కఛాన్స్ అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక తాగు, సాగునీటి కష్టాలు పోయయన్నారు.తెలంగాణ వస్తే ఏం అభివృద్ధి జరిగిందో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, జెడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్యగౌడ్,కల్లూరు రామచంద్రారెడ్డి, సిద్దిగోని హరి శంకర్ గౌడ్, ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ బాల్ నరసయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ కొండల్ రెడ్డి,వసంత శ్రీనివాస్ గౌడ్.కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love