ప్రభుత్వానికి మధ్య వారధి ఉద్యోగులు…

– భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి…
నవ తెలంగాణ భువనగిరి రూరల్ : ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారథి ఉద్యోగులని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ఉద్యోగ సంఘాలు నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం, డైరీ,  క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి  శాసనసభ్యులు  ముఖ్యఅతిథిగా, జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే విశిష్ట అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వారిద్దరిని పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉద్యోగులు వారధి లాంటి వాళ్ళని, ప్రజా ప్రతినిధులు ఉద్యోగులు అందరం కలిసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిద్దామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరం సమన్వయ సహకారంతో ఏ పనైనా విజయవంతంగా చేయగలుగుతామని, అధికారులు,  ఉద్యోగులు గత శాసనసభ ఎన్నికలను  విజయవంతంగా నిర్వహించారని,  అదే స్ఫూర్తితో  రాబోయే పార్లమెంటు ఎలక్షన్లను కూడా దిగ్విజయంగా నిర్వహిద్దామని అన్నారు. వారు ఈ సందర్భంగా పలు ఉద్యోగ సంఘాల డైరీలు, బ్రోచర్లు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏ భాస్కరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి అమరేందర్,   గజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మందడి ఉపేందర్ రెడ్డి, కోశాధికారి సురేష్,  కలెక్టరేట్ సూపర్డెంట్ జగన్, ట్రెసా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేశ్యా నాయక్, జిల్లా నాన్ గెజిటెడ్ సంఘం అధ్యక్షులు భగత్, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కే.శ్రీకాంత్, ఉపాధ్యక్షులు ఎండి ఖదీర్, శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శైలజ, నల్లగొండ జిల్లా నాన్ గెజిటెడ్ సంఘం సెక్రటరీ కే కిరణ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Spread the love