Friday, July 17, 2026
E-PAPER
Homeఆటలురెండో వన్డేలో ఇంగ్లాండ్‌ ఘన విజయం..

రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ ఘన విజయం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 234 పరుగుల లక్ష్యాన్ని 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జో రూట్‌ (99*) సెంచరీ మిస్సయ్యింది. విల్‌ జాక్స్‌ (30), సామ్‌ కరన్‌ (26), అట్కిన్సన్‌ (23*), జోస్‌ బట్లర్‌ (17), హ్యారీ బ్రూక్‌ (16), బెతెల్‌ (4) పరుగులు చేశారు. బెన్‌ డకెట్‌ డకౌటయ్యాడు. భారత బౌలర్లలో గుర్నూర్‌ బ్రార్‌ రెండు వికెట్లు, బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ ప్రస్తుతానికి 1-1తో సమమైంది. 19న లార్డ్స్‌ స్టేడియంలో నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది.
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్‌ అయ్యర్ (66), విరాట్ కోహ్లీ (65) హాఫ్ సెంచరీలు సాధించారు. శుభ్‌మన్ గిల్ (31), రోహిత్ శర్మ (26) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు ఇషాన్ కిషన్ (1), సుందర్ (2), అక్షర్ (1), దూబే (0), గుర్నూర్ బ్రార్ (7) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, గస్ అట్కిన్సన్ 3, సకిబ్ మహమూద్ 2.. సామ్‌ కరన్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -