
ముఖ్యమంత్రి సహాయనిధితో పేద, మధ్యతరగతి ప్రజల వైద్యానికి ఎంతో భరోసా లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఉప్లూర్ లో ముగ్గురు లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు.గ్రామానికి చెందన రెంజర్ల భారతి, ఆకుల సునీత, పూజారి లక్ష్మి, లకు ప్రభుత్వం సుమారు రూ.90 వేల విలువైన చెక్కులను ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మంజూరు చేసింది.అట్టి ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా కొమ్ముల రవీందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పలు అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న పలువురు లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కృషితో ప్రభుత్వ ఈ ఆర్థిక సహాయం చెక్కులను మంజూరు చేసిందన్నారు. ఆర్థిక సహాయం చెక్కుల మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అవారి సత్యం, సుంకరి విజయకుమార్, మారుపాక నరేష్, ఏనేడ్ల గంగారెడ్డి, రాజేశ్వర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.