ముఖ్యమంత్రి సహాయనిధితో పేదల వైద్యానికి భరోసా..

Ensuring the treatment of the poor with the Chief Minister's relief fund.– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
ముఖ్యమంత్రి సహాయనిధితో పేద వైద్యానికి ఎంతో భరోసా లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. మంగళవారం మండలంలోని ఉప్లూర్, కమ్మర్ పల్లి గ్రామాల్లో 10 మంది లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పలు అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న పలువురు లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కృషితో ప్రభుత్వ ఆర్థిక సహాయం చెక్కులను మంజూరు చేసిందన్నారు. ఉప్లూర్ లో పూజారి అరుణకు రూ.18వేలు, చిన్నబోయిన గంగుకు కు రూ.25వేల 5వందలు, జక్కుల సరితకు రూ.21వేలు, సాదుల్లా గంగాధర్ కు రూ.38వేలు, కమ్మర్ పల్లిలో ఊట్నూరి స్రవంతికి 20వేలు, సంగెం హనుమవ్వ కు రూ.19వేల 5వందలు, బద్దం సౌజన్యకు రూ.28వేలు, జరుపుల గంగుబాయికి రూ. 22వేల 5వందలు, కలాలి బాలకిషన్ కు రూ.44వేలు, లాడే ప్రేమ్ చంద్ కు రూ.28వేలు ఆర్థిక సహాయం చెక్కులను ప్రభుత్వం మంజూరు చేసింది. అట్టి ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఆర్థిక సహాయం చెక్కుల మంజూరుకు  కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో ఉప్లూర్ లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, రైతు విభాగం మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, అవారి సత్యనారాయణ, మారుపాక నరేష్, బైండ్ల శ్రీనివాస్, అవారి శ్రీనివాస్, పత్రి రవి, కమ్మర్ పల్లి లో నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, నూకల బుచ్చి మల్లయ్య, నల్ల గణేష్ గుప్తా, సాయికుమార్, దూలూరు కిషన్ గౌడ్, పాలేపు చిన్న గంగారం, వేములవాడ జగదీష్, సింగిరెడ్డి శేఖర్, గణేష్, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love