అప్పన్న హస్తం కోసం ఎంటెక్ విద్యార్థి ఎదురు చూపు..

నవతెలంగాణ – తాడ్వాయి
ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. చదువులన్నీ ప్రభుత్వ పాఠశాలలోనే పూర్తి చేశాడు. లక్షలు పెడితే గాని లభించని నీట్ కర్ణాటక (రౌండ్ వన్ లో) సివిల్ ఇంజనీర్ సీటు కృషికి పట్టుదలకు ఇట్టే వరించింది. కానీ తన కుటుంబానికి ఉన్న ఆర్థిక పరిస్థితులు మాత్రం సంకెళ్లుగా మారాయి. తాను చదువుతానో లేదో అని బెంగ ప్రారంభం నుండి మొదలైంది. ఎవరైనా దాతలు తన చదువుకు అప్పన్న హస్తం అందిస్తారని ఎదురుచూపులు చూస్తున్నాడు. వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీకి చెందిన కొత్తూరు(జంపంగవాయి) గ్రామానికి చెందిన అనుముల శ్రీకాంత్ చిన్నతనంలోనే తండ్రి ని కోల్పోయి, తల్లితో కూలీ, నాలి పనులు చేసుకుంటూ డబ్బులను పోగు చేసుకుని చదువుకున్నాడు. ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాల్లో ర్యాంక్ సాధించాడు.  ఆల్ ఇండియా లెవెల్ లో 2790 ర్యాంకు సాధించి, “నీట్’ కర్ణాటక” లో సీటు సంపాదించాడు. శ్రీకాంత్ కు మాత్రం ఒకపక్క సంతోషం, మరోపక్క ఆందోళన చదువు కొనసాగింపు పై బెంగ వెంటాడుతూనే ఉంది. తన కుమారుడు చదువు కొనసాగింపునకు విశాల హృదయం కలిగిన దాతలు చేయూత నందించాలని కుటుంబ పెద్దలు ఆర్జిస్తున్నారు.
Spread the love