అసైన్డ్ భూమిపై హక్కును కల్పించండి..

నవతెలంగాణ – రాయపర్తి
ఆర్థికంగా చితికిపోయిన మాకు మండల కేంద్రం శివారులో అసైన్డ్ భూమిపై హక్కును కల్పించి తప్పుడు ధ్రువపత్రాలతో భూమిని పట్టా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మండల కేంద్రానికి చెందిన జేరిపోతుల యాకయ్య, జేరిపోతుల నరేందర్ బుధవారం మండల కేంద్రంలోని మండల మేజిస్ట్రేట్ కార్యాలయంలో తహశీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రం శివారులో 52/1/ఏ సర్వే నెంబర్ లో గత ప్రభుత్వం మా తాతకు, వారి అన్నదమ్ములకు చెరి 16 గుంటల చొప్పున వ్యవసాయం చేసుకోవడానికి కేటాయించిందని తెలిపారు. కాలక్రమేన భూమిని కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఇప్పుడు తమ కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని వ్యవసాయం చేసుకోవడానికి తమకు అసైన్డ్ భూమిని కేటాయించాలని కోరారు. కొందరు వ్యక్తులు తప్పుడు ధ్రువపత్రాలతో, పేర్లతో తమకు కేటాయించిన భూమిని అక్రమంగా పట్టా చేసుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చెందాల్సిన భూమిని అక్రమంగా పట్టా చేసుకోవాలని చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. తమ భూమి తమకు వచ్చేంతవరకు న్యాయపరంగా పోరాడతాము అన్నారు.
Spread the love