పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే

Environmental protection is everyone's responsibility: MLAనవతెలంగాణ – అచ్చంపేట 
ఈ సృష్టిలోని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యత గా చెట్లను పెంచాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎలుక చింత ,మల్ల నేరేడు,  రాగి , నేరడు, తదితర 1000 మొక్కలు నాటారు. మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షణ చాలా ముఖ్యం అన్నారు. భూమి మీద మనుషులతో పాటు పకృతి వన్యప్రాణులు, పక్షులు గురించి ఆలోచన చేయడం గొప్ప ఆలోచన అన్నారు. పకృతిని కాపాడడానికి కృషి చేస్తున్న నేచర్ ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ సొసైటీ వారిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి,  రోటరీ క్లబ్ చైర్మన్ జూబ్లీహిల్స్ అధ్యక్షుడు బాలకోటి రెడ్డి, ఎన్జీవో సభ్యులు జెట్టి రమేష్ , కొరకుల శ్రీనివాస్, తగిలి బాల కురుమయ్య,  వెంకటేష్, పాతలావత్ రమేష్,  బిచ్చ తదితరులు పాల్గొన్నారు.
Spread the love