ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపు కోరుతూ పాదయాత్ర

నవతెలంగాణ- తొర్రూర్ రూరల్:
పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరుకుంటూ గుర్తురు దయన్న యువసేన ఆధ్వర్యంలో గ్రామ భద్రకాళి గుడి నుండి శివాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమి ఎరుగని నేత దయాకర్ రావు నిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకున్ని గెలిపించుకోవాలని వారు ప్రజలకు తెలిపారు. ఈ పాదయాత్రలో కమిటీ అధ్యక్షులు బి నవీన్ ఉపాధ్యక్షులు రాధాకృష్ణ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, రంజిత్, మధు, నితిన్, రమేష్, సాగర్, అనిల్, కార్తీక్, నిఖిల్, సతీష్, కుమార్, మహేష్, సిద్దు, ఈశ్వర్ సందీప్, రాకేష్, విక్రమ్, వెంకటేష్ శ్రీను, సందీప్, శ్రీరామ్, నాగరాజు రవి, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love